Header Banner

తిరుపతిలో మంచు మనోజ్ హల్‌చల్! "నన్ను అరెస్టు చేయండి" అంటూ పోలీస్ స్టేషన్‌కు..!

  Tue Feb 18, 2025 10:26        Others

గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ  వివాదంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హీరో మంచు మనోజ్  ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తూ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. తాజాగా తిరుపతి జిల్లా , భాక్ర పేటలో ప్రైవేట్ రిసార్ట్స్ లో మంచు మనోజ్ స్టే చేశారు. ఘాట్ రోడ్, ప్రైవేట్ రిసార్ట్స్ పరిసర ప్రాంతాలలో పోలీసులు సోమవారం అర్ధరాత్రి గస్తీ చేస్తున్న సమయంలో ప్రైవేట్ బౌన్సర్లు ఉండటాన్ని చూసి.. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయం బౌన్సర్లు మనోజ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన రిసార్ట్స్ నుంచి పోలీస్ స్టేషన్‌కు వచ్చి.. ‘నన్ను అరెస్టు చేయడానికి మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలుసు.. నన్ను అరెస్టు చేయండి..’ అంటూ మంచు మనోజ్ అన్నారు. దీంతో ‘మేము అరెస్టు చేయడానికి రాలేదు.. రాత్రి పూట హైవేపైన, ఘాట్ రోడ్ ప్రాంతంలో బౌన్సర్లు ఉండటంతో ఎవరు.. అన్న వివరాలు అడిగి తెలుసుకున్నాం’ అని భాక్రా పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ అన్నారు. ఈ క్రమంలో పీఎస్ దగ్గర మెట్లపై మంచు మనోజ్ కూర్చున్నారు. తాను రిసార్ట్స్‌లోఉంటే ఎందుకు వేధిస్తున్నారు.. తన గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారంటూ మంచు మనోజ్ పోలీసులను అడిగారు.


ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!


మంచు మనోజ్ కుటుంబంలో గొడవలు
కాగా మంచు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత రెండు నెలలుగా టీవీ సీరియల్‌గా సాగుతున్న ఈ కలహాలు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరాయి. మోహన్ బాబు యూనివర్సిటీకి గతంలో తన అనుచరులతో వెళ్లడం గందరగోళానికి దారి తీసింది. తిరుపతి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం అప్పటికి ముగిసింది. మనోజ్ వ్యవహరిస్తున్న తీరుపై అటు మోహన్ బాబు.. అలాగే సోదరుడు విష్ణు వ్యవహరిస్తున్న తీరుపై మనోజ్ మండిపడటం తెలిసిందే.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #manchmanoj #halchal #arrest #policestation #thirupathi #todaynews #flashnews #latestupdate